తెదేపా హయాంలో పట్టణ గృహ నిర్మాణ పథకంపై అవినీతి జరిగిందని వైకాపా ప్రభుత్వం ఆరోపించటంపై నారా లోకేశ్ మండిపడ్డారు. "ప్రతి పేదకూ సొంత ఆస్తి ఇవ్వాలన్న ఆలోచనతో అత్యాధునిక సౌకర్యాలతో చంద్రబాబు ఇళ్లు కట్టించి ఇచ్చారు. మూడు విడతల్లో 8,00,346 ఇళ్లు పంపిణీ చేశారు. ఇది మేము గర్వంగా చెప్పుకోగలం. 2014కు ముందు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టేందుకు రూ.11 వేల కోట్లు కేటాయించి, అందులో రూ.7,759 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులోనూ లబ్ధిదారులకు రూ.3,500 కోట్లు ఖర్చుపెట్టి మిగతా రూ.4150 కోట్లు దోపిడీ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పరాకాష్ట అది" అని ట్వీట్ చేశారు.
'బొత్సని అడగండి.. అవినీతి అంటే ఏంటో తెలుస్తుంది' - tweets
వైకాపా ప్రభుత్వ నిర్ణయాలపై ట్విటర్లో నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పట్టణ గృహ నిర్మాణాలపై రివర్స్ టెండరింగ్‌కు జగన్ ఆదేశించటంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నారా లోకేశ్
"ఆ రోజుల్లో మీరు క్విడ్ ప్రో కోలో బిజీ కాబట్టి మీకు ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై అవగాహన ఉండకపోవచ్చు. మంత్రి బొత్స సత్యనారాయణని అడిగుంటే, 14 లక్షల ఇళ్లను కట్టకుండానే బిల్లులు తీసుకున్న అవినీతిని వివరించేవారు" అని జగన్‌ను లోకేశ్ విమర్శించారు. "వైఎస్ఆర్ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ల వంటి నాసిరకమైన గృహాల్లోనే పేదలు ఉండాలని భావిస్తున్నారు. టెక్నాలజీ ప్రయోజనాలు పేదలకు అనవసరమని మీరు అనుకుంటున్నట్టు ఉన్నారు" అంటూ ట్వీటర్ లో వాగ్బాణాలు విసిరారు.
Last Updated : Jul 3, 2019, 7:26 PM IST