విత్తన పంపిణీ ప్రక్రియ మొదలైందని... వేరుశనగ విత్తనాలపై 40 శాతం రాయితీ ఇస్తున్నామని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులు నిలిపివేస్తున్నామని తెదేపాకు ఎవరు చెప్పారని అనిల్‌కుమార్ ప్రశ్నించారు. యూసీలు ఇవ్వనందునే కేంద్రం నుంచి నిధులు రాలేదన్న మంత్రి... ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షానికి భయం ఎందుకని నిలదీశారు. రీటెండరింగ్‌కు జ్యుడీషియల్ కమిటీ వేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రజాధనం వృథా కాకుండా చూడాలనే ఈ ప్రక్రియ ప్రారంభించామన్న అనిల్‌కుమార్... సరిగా ఉంటే పనులు ముందుకు వెళ్తాయని చెప్పారు. అంచనాలు మించి ఉంటే రీటెండరింగ్‌కు అదేశిస్తామని స్పష్టం చేశారు.
ప్రాజెక్టులపై ప్రతిపక్షానికి భయం ఎందుకు: అనిల్‌కుమార్ - YCP Government
రాష్ట్రంలో విత్తన పంపిణీ ప్రక్రియ మొదలైందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి అనిల్‌కుమార్ యాదవ్