ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. వైకాపాకు సంబంధించి వీడియోలూ ఈసీకిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారుల బదిలీపై సీఈసీకి తమ నిరసన వ్యక్తం చేశారు. అరగంట పాటు చర్చించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. తెదేపా చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
ఈసీకి చంద్రబాబు లేఖ అందించిన కనకమేడల - complaint
తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. వైకాపాకు సంబంధించి వీడియోలూ ఈసీకిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారుల బదిలీపై సీఈసీకి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈసీకి చంద్రబాబు లేఖ అందించిన కనకమేడల
వైకాపా ఫిర్యాదులకు ఈసీ స్పందించి బదిలీ చేస్తుందని... తెదేపా ఇచ్చిన 150 ఫిర్యాదులను పట్టించుకోవట్లేదని కనకమేడల మండిపడ్డారు. ఈ రెండు రోజులైనా ఏ సంఘటన జరగకుండా చూడాలని... లేకపోతే ఈసీపై న్యాయబద్దంగా ముందుకెళ్తామనికనకమేడల హెచ్చరించారు.