తెదేపాకు చెందిన రాజ్యసభ సభ్యులు భాజపా గూటికి చేరడంపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎంపీలు వెళ్తారని అనుకోలేదని ఆయన అన్నారు. సుజనా, సీఎం రమేశ్ వంటి నేతలు ఫలితాలు వచ్చాక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు... వీరంతా చంద్రబాబు మీద నమ్మకం కలిగిన వ్యక్తులే అని కాలవ అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై చర్చిస్తామని వెల్లడించారు. ఏ కష్టానైనా పార్టీ తట్టుకుని నిలబడుతుందని కాలవ ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీలు వెళ్తారని అనుకోలేదు: కాలవ శ్రీనివాసులు - sujana
ఇంత తక్కువ సమయంలో ఎంపీలు వెళ్తారని అనుకోలేదని మాజీ మంత్రి, తెదేపా నేత కాలవ శ్రీనివాసులు అన్నారు. సుజనా, సీఎం రమేశ్ వంటి నేతలు ఫలితాలు వచ్చాక ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు.
కాలవ శ్రీనివాసులు