టికెట్ కోసం పవన్ అభ్యర్థన
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది.ఆశావహుల నుంచి స్వీకరించే దరఖాస్తులకు సంబంధించి ఏర్పాటు చేసిన నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలిగా తన వివరాలను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించటంతో పాటు, శాసనసభ అభ్యర్ధిత్వానికి దరఖాస్తు చేశారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. నిబద్ధత ఉన్న వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తామని తెలిపారు. మాదాసు గంగాధరం నేతృత్వంలో ఏర్పడిన స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఎలాంటి వివరాలు పొందుపర్చాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు వంటి అంశాలపై చర్చ జరిగింది. డబ్బుకు ప్రాధాన్యం లేకుండా, నిబద్ధత, కష్టపడేతత్వాన్ని బట్టి అభ్యర్ధుల్ని నిర్ణయిస్తామని... ఎలాంటి పైరవీలు ఉండవని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న పవన్