విజయవాడలో కార్మిక సంఘాల నేతలతో ఎండీ సురేంద్రబాబు సమావేశం ముగిసింది. సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ సహా 10 సంఘాల ఐకాస నేతలతో ఎండీ చర్చించారు. అనంతరం ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈయూ సహా 10 సంఘాల ఐకాస నేతలు కూడా సచివాలయానికి చేరుకున్నారు. కార్మిక సంఘాలతో సచివాలయంలో సీఎం చర్చలు జరపనున్నారు. సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తారు. రవాణా శాఖమంత్రి పేర్ని నాని కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించనున్నారు.
ఆర్టీసీ ఐకాస నేతలతో భేటీకానున్న సీఎం జగన్
ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సమావేశమయ్యారు. ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసే డిమాండ్ సహా ప్రధాన డిమాండ్లపై చర్చించారు. సచివాలయంలో సీఎం జగన్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమావేశం కానున్నారు.
ఆర్టీసీ విలీనంపై కీలక సమావేశం
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ...ప్రభుత్వం నుంచి తాత్కాలిక సాయానికి సంబంధించిన అంశంపై జగన్ వివరించనున్నారు. సీఎం నుంచి హామీ రాగానే సమ్మె యోచన విరమణపై కార్మిక సంఘాలు ప్రకటన చేయనున్నాయి.
Last Updated : Jun 10, 2019, 11:11 AM IST