ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి వైకాపాలో ముసలం

మంగళగిరి వైకాపాలో అగ్గి రాజుకుంది. ఈసారి ఎమ్మెల్యే సీటు ఆళ్ల రామకృష్ణకు రాదని ప్రచారం జోరందుకున్నందున... ఆర్కే మద్దతుదారులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఆర్కేకు కాకుండా సీటు ఎవరికిచ్చినా పోరు తప్పదని హెచ్చరిస్తున్నారు.

మంగళగిరి పంచాయితీ

By

Published : Mar 2, 2019, 5:44 AM IST

Updated : Mar 2, 2019, 10:20 AM IST

మంగళిగిరిలో వైకాపా నేతల అలకలు

గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపాలో అలజడి రేగింది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గురు కౌన్సిలర్లు వైకాపాలో చేరడం... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్టికి తెలియకుండా వారిని చేర్చుకోవడంపై అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. వైకాపా అధిష్ఠానం తీరును నిరసిస్తూ పలువురు నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. శుక్రవారం జగన్ సమక్షంలో.. తెదేపా కౌన్సిలర్ ఉడతా శ్రీను, భాజపా కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వర రావు, సీపీఎం కౌన్సిలర్ శకుంతల పార్టీ కండువాను కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా తరపున ఉడత శ్రీను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటారని ప్రచారం జరగడంపై పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలలాకు చెందిన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మంగళగిరి పురపాలక సంఘం 15, 32 వార్డు కౌన్సిలర్లు స్వరూపారాణి, సునీతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ నాయకులకు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆర్కేకికాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే వారిని ఓడిస్తామని తేల్చి చెప్పారు. నేడు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు

Last Updated : Mar 2, 2019, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details