హత్యా రాజకీయాలు జగన్ కుటుంబానికే అలవాటని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య గురించి... జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రతి ఘటన వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందనడం దారుణమన్నారు. వివేకా హత్యపై చంద్రబాబు వెంటనే సిట్ విచారణకు ఆదేశించిన విషయం గుర్తుచేశారు. దర్యాప్తులో నిజాలు బయటపడతాయని జగన్కు భయపడుతున్నాడన్న హోంమంత్రి... ఏపీ పోలీసులపై నమ్మకం లేదు కానీ... ప్రజల ఓట్లు మాత్రం కావాలా అని ప్రశ్నించారు. హత్యకేసు దోషులకు తగిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.
హత్యా రాజకీయాలు వాళ్లకే అలవాటు!
ప్రతి ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందనడం దారుణమని హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేని జగన్... ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
మాట్లాడుతున్న చినరాజప్ప