ETV Bharat / state
ష్..! వివేకా హత్యపై ఏప్రిల్ 15వరకూ ఎవ్వరూ మాట్లాడొద్దు
వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై... హైకోర్టులో వాదనలు ముగిశాయి. వచ్చే నెల 15వ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది. అధికార, ప్రతిపక్షనేతలు ఎవరూ కేసుపై ఎక్కడా మాట్లాడవద్దని కోర్టు ఆదేశించింది.
వైఎస్ వివేకా హత్యకేసులో ముగిసిన వాదనలు
By
Published : Mar 29, 2019, 6:48 PM IST
| Updated : Mar 29, 2019, 7:54 PM IST
వైఎస్ వివేకా హత్యకేసులో ముగిసిన వాదనలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వచ్చే నెల పదిహేనో తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.అప్పటి వరకూ అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు ఎవరూ వివేకానందరెడ్డి హత్య కేసుపై మీడియా ముందుగానీ, బహిరంగసభల్లో కానీ మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలు, ఇటు జగన్ సహా వైకాపా నేతలెవరూ హత్య పై మాట్లాడవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.ఇకపై హత్యగురించి మాట్లాడబోమని కోర్టుకు అంగీకారపత్రం ఇవ్వాలనీ నిర్దేశించింది. సిట్ విచారణ యథావిధిగా కొనసాగించుకోవచ్చని సూచించిన ధర్మాసనం.. ప్రత్యేక దర్యాప్తు బృందంకేసు వివరాలు బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. ఇవి చూడండి...
Last Updated : Mar 29, 2019, 7:54 PM IST