గత ఐదేళ్లలో ప్రత్యేక హోదా సాధనకు తెలుగుదేశం పోరాడిందని.... ఇప్పుడు ఆ బాధ్యత 22 మంది MPలకు ప్రజలు అప్పగించారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాణంపై చర్చలో మాట్లాడిన ఆయన.. హోదా హామీ ఇచ్చి... మాట తప్పినందుకే ఏపీలో భాజపా ఘోరపరాజయం పాలైందని వ్యాఖ్యానించారు. తాము సాధించలేదని భావించిన ప్రజలు ప్రత్యామ్నాయంగా వైకాపాను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా కచ్చితంగా ఇవ్వాలని తేల్చి చెప్పిన ఆయన... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానాలకు స్వస్తి చెప్పాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
'ప్రత్యేకహోదా బాధ్యత వైకాపాపై ఉంది' - ysrcp
ప్రత్యేకహోదా తీసుకురాని తెలుగుదేశానికి..... ఇవ్వని భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని.... ఇప్పుడు ఆ బాధ్యతను వైకాపాపై వేశారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో మాట్లాడిన ఆయన... ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఎంపీ గల్లా జయదేవ్