రాష్ట్రంలో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. అవినీతి నిర్మూలనపై గట్టి సందేశాన్ని ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో ఎంత మేరకు అవినీతి నిర్మూలన జరిగిందని ఆయన ప్రశ్నించారు. అవినీతిపై ఎవరి స్థాయిలో వారు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. లంచం ఇవ్వకుండా తమ పని పూర్తయిందనే భావన ప్రజల్లో రావాలని సూచించారు.
అవినీతి నిర్మూలనపై దృష్టి సారించండి: సీఎం - eradication of corruption
అవినీతిరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు పోరాడాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. లంచం ఇవ్వకుండానే తమ పని పూర్తయిందనే భావన ప్రజల్లో రావాలని కోరారు.
ముఖ్యమంత్రి జగన్