ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టుకు నీరు పోయలేదని.. రూ.5 వేలు జరిమానా!

నీటి ఎద్దడి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇటవలే చెన్నై ఉదంతం యావత్ భారతానిని ఆత్మ రక్షణలో పడేసింది. దీనికి ఏకైక పరిష్కారం మొక్కల పెంపకమే అన్నది అందరికీ తెలిసిన సత్యమే! అయితే.. కిరాణా షాపు ఎదుట ఉన్న మొక్కకు నీరు పోయలేదని అక్కడి కమిషనర్ రూ. 5 వేలు జరిమానా విధించడం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది.

'చెట్లకు నీరుపోయలేదని 5 వేలు జరిమానా'

By

Published : Jul 18, 2019, 9:44 PM IST

'చెట్లకు నీరుపోయలేదని 5 వేలు జరిమానా'

కల్తీ వస్తువులు అమ్మినందుకు... ప్రమాణాలు పాటించనందుకు అధికారులు జరిమానాలు వేయడం చూశాం. కానీ ఇది అందుకు విభిన్నమైన కథ. అందరూ హర్షించే కథ.

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కిరాణా షాపు ఎదుట నాటిన మొక్కలకు నీరు పోయలేదని మున్సిపాలిటీ అధికారులు షాపు యజమానికి జరిమానా వేశారు.

గుంతకల్లు రోడ్డులో 8 నెలల క్రితం నూతనంగా నిర్మించిన షాపుల ముందు మున్సిపల్​ అధికారులు చెట్లు నాటారు. కొత్తగా వచ్చిన కమిషనర్​ గంగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. చెట్లకు నీరు పోయకుండా నిర్లక్ష్యం చేసిన.. షాపు యజమాని నంద కుమార్​కు ఐదు వేలు జరిమానా వేశారు. చెట్ల పెంపకం రక్షణ కింద జరిమానా వేసినట్లు గంగిరెడ్డి తెలిపారు. చెట్ల పెంపకంపై ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతమైన గుత్తి కోటలోని... చుట్టుపక్కల పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి..సీతారాముల తలంబ్రాలకు శ్రీకారం.. కాడి పట్టిన రాంబంట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details