రాష్ట్ర బడ్జెట్ను చూసి ప్రతిపక్షనేత చంద్రబాబుకు దిమ్మతిరిగిందని వైకాపా శాసనసభ్యురాలు రోజా ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా రాష్ట్రంలో కౌలు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. వాయిదా తీర్మానం దేనిమీద పెట్టాలో కూడా తెదేపా శాసనసభ్యులకు తెలియటం లేదని ఎద్దేవా చేశారు.
దేశంలో ఏ సీఎం చేయని పని జగన్ చేశారు: రోజా - roja
గత ఐదేళ్లలో చంద్రబాబు రైతులను ఏనాడూ పట్టించుకోలేదని వైకాపా శాసనసభ్యురాలు రోజా విమర్శించారు. రైతుల పక్షపాతిగా జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు.
వైకాపా శాసనసభ్యురాలు రోజా