ఎండలు మండుతున్నాయి.. జాగ్రత్తగా ఉండండి: సీఎం - heatwave
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించి నమోదవుతున్నాయి. 210 మండలాల్లో వేడి గాలులు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఎండలు మండుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆర్టీజీఎస్ హెచ్చరించిన ప్రకారం.. ఈ నెల 10 వరకూ వడగాడ్పుల తీవ్రత ఉంటుందని.. ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని ట్విటర్లో చెప్పారు. 210 మండలాల్లో వేడి గాలుల ప్రభావం ఉంటుందన్నారు. పిల్లలు, వృద్ధులు ఎండలో బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. వేడి గాలుల సమయంలో చేయకూడని పనులను వివరిస్తూ ఓ సందేశాన్ని ట్వీట్‌కు జత చేశారు. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలన్నారు.