గృహ నిర్మాణ పథకం అమలు అస్తవ్యస్తంగా ఉంది! - bosta
గృహ నిర్మాణ పనుల్లో పురోగతి తక్కువగా ఉందని మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాల కోసం గత ప్రభుత్వం భారీ వ్యయం చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
bosta_satyanarayana_review_on_housing
టిడ్కో ప్రధాన కార్యాలయంలో మంత్రి బొత్స అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, టిడ్కో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణ పనుల్లో పురోగతి తక్కువగా ఉందని...పథకం అమలు అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ వద్ద చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. లబ్ధిదారుడి వాటా ప్రభుత్వం చెల్లించే అంశంపై విధివిధానాలు రూపొందించనున్నట్లు వెల్లడించారు.