ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాక్ష్యాలు లేకుండా చేశారనే అనుమానం! - ముఖ్యమంత్రి చంద్రబాబు

వివేకానందరెడ్డిని దారుణంగా చంపేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు కఠినంగా శిక్ష పడాలన్నారు. దోషులైతేనే సాక్ష్యాలు లేకుండా చెరిపివేస్తారని చెప్పారు. సాక్ష్యాలు ధ్వంసం చేశారు కనుకే అనుమానాలు పెరిగాయన్నారు.

మాట్లాడుతున్న చంద్రబాబు

By

Published : Mar 15, 2019, 11:27 PM IST

మాట్లాడుతున్న చంద్రబాబు
వైఎస్వివేకానందరెడ్డి హత్యపై వారి ఇంట్లో ఉన్న అందరినీ విచారణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హత్య జరిగిన తర్వాత అనేక అడ్డదారులు తొక్కారని ఆరోపించారు. నేర మనస్తత్వం ఉన్నవాళ్లకు ఇలాంటి ఆలోచనలే వస్తాయని చెప్పారు. కావాలనే ఇతరులపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు.

వివేకా గుండెపోటుతోనే చనిపోయారనిపోలీసులను నమ్మించేందకూ ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి అన్నారు.వివేకాను ఎవరు.. ఎందుకు హత్య చేయాల్సివచ్చిందో తెలియాలని చెప్పారు. హత్య చేసి కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం నేరమని స్పష్టం చేశారు.ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు.

వివేకా తెల్లవారుఝామునే చనిపోతేఉదయం 8 గంటల వరకూఎందుకు ఫిర్యాదు చేయలేదని ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు.కుటుంబ సభ్యులు చెబుతున్న లేఖ విషయం కట్టుకథలా ఉందన్నారు. వైఎస్ వివేకా హత్యలో అనేక రహస్యాలు ఉన్నాయని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details