పునర్విభజన చట్టం(2014)లో పేర్కొన్న అంశాల ప్రకారం ప్రత్యేక హోదా ఏపీకి రావాల్సిన హక్కుగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయినప్పటికీ మాకెందుకు అన్యాయం చేశారని కేంద్రాన్ని నిలదీశారు.
మాకే ఎందుకు ఇంత అన్యాయం : సీఎం
ఎన్డేయేతర పార్టీల నేతలతో దిల్లీలో భేటీ అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలను పూసగుచ్చినట్లు వివరించారు.
దిల్లీ సమావేశానికి బయలుదేరకముందు జరిగిన సమీక్షలో సీఎం
ఆంధ్రు హక్కును కాలరాసిన మీరు ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తామంటున్నారని భాజాపాను ప్రశ్నించారు. మహాకూటమి పక్షాలతో సమావేశమయ్యేందుకు దిల్లీకి సీఎం వచ్చారు. విభజన తర్వాత ఎన్ని అడ్డంకులెదురైనా ఏపీ 10.52 శాతం వృద్ధిరేటు సాధిస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు.