అనిశా డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు
అనిశా డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అనిశా డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు... అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిఘా విభాగం డీజీగా ఉన్న ఆయనను... సార్వత్రిక ఎన్నికల సమయంలో విధుల నుంచి ఎన్నికల సంఘం తప్పించింది. అప్పటినుంచి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆయనను.. తాజాగా అనిశా డీజీగా ప్రభుత్వం నియమించింది.