ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రంలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి.. మరో ముగ్గురి కోసం గాలింపు - students

Engineering students: వారంతా వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు. గుంటూరులోని జి.వి.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. విహారయాత్ర కోసం సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు సేదతీరి.. ఆ తరువాత సముద్ర స్నానానికి వెళ్లారు. అలల తాకిడి పెరగడంతో నలుగురు గల్లంతయ్యారు.

GVR Engineering College  Students
సముద్రంలో గల్లంతై మృతి

By

Published : Oct 20, 2022, 7:19 PM IST

Engineering students died: విహారయాత్ర విషాద యాత్రగా మారిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో జరిగింది. గుంటూరులోని జీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏడుగురు రామాపురం బీచ్​కు వచ్చారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల తాకిడికి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహాదేవ్ అనే యువకుడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురాగా.. తెనాలికి చెందిన రమణ, గౌతమ్​లతోపాటు గుంటూరుకు చెందిన రోహిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఒడ్డుకొచ్చిన మృతదేహం హైదరాబాద్​కు చెందిన మహాదేవుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ గుంటూరు జీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details