MP Mopidevi Venkataramana Key Comments:బాపట్ల జిల్లా రేపల్లె రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జగన్ బాధ్యుల మార్పుతో రేపల్లె వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణను కాదని, రేపల్లె నియోజకవర్గ ఇంఛార్జిగా ఈవూరు గణేష్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలపై ఎంపీ మోపిదేవి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని పరిస్థితులలో మనసు చంపుకుని ఇష్టం లేకపోయినా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎంపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపైనే ఈ రకంగా వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు: రాజకీయంలో కొన్ని ఇష్టం లేని పనులను కూడా మనసు చంపుకుని చేయాల్సిన పరిస్థితి ఉందనీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో నిర్వహించిన కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడారు. చదువు కొన్నాం అన్నదానికి, చదువుకున్నాము అనడానికి చాలా వ్యత్యాసం ఉందనీ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవస్థ వచ్చి చదువు కొనలేని పరిస్థితి ఏర్పడిందని మోపిదేవి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలను తీసుకు వచ్చిందని తెలిపారు. తద్వారా విద్యను అందరికీ అందేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీడీపీలోకి వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు - చర్చనీయాంశంగా మోపిదేవి ప్రధాన అనుచరుడి పార్టీ మార్పు