Lorry Stuck at Railway Crossing: బాపట్ల జిల్లాలో రైల్వే క్రాసింగ్ వద్ద లారీ ఇరుక్కుపోవటతో ఒకింత ఆందోళన నెలకొంది. వేమూరు మండలం పెనుమర్రు స్టేషన్ సమీపంలో ఉన్న లెవల్ క్రాసింగ్ వద్ద లారీ సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. అదే సమయానికి రేపల్లె నుండి గుంటూరుకు వెళ్లే ప్యాసింజర్ రైలు వచ్చింది. రైలు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ముందుగానే రైలును ఆపివేశారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ట్రాక్టర్‌తో పాటుగా స్థానికుల సహకారంతో లారీని గేటు బయటకు లాగారు. దీంతో రైలు వెళ్లడానికి మార్గం సుగమం అయింది. దాదాపు 40 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిన లారీ.. అదే సమయానికి వచ్చిన రైలు
Lorry Stuck at Railway Crossing: ధాన్యం రవాణా చేసేందుకు వస్తున్న లారీ రైల్వే గేటు మధ్యలో సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. అదే సమయానికి రైలు రావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. రైలు డ్రైవర్ అప్రమత్తమై ముందుగానే రైలును ఆపివేశారు. దీంతో బాపట్లజిల్లాలో వేమూరు మండలం పెనుమర్రు స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద దాదాపు 40 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది.
రైల్వే క్రాసింగ్