Non-restoration of the power supply in Chinaganjam: బాపట్ల జిల్లా చినగంజాం మండలం మూడు రోజులుగా చీకట్లో మగ్గుతోంది. ఈనెల 5వ తేదీ ఆదివారం రాత్రి ఈదురుగాలుల ప్రభావంతో.... వందకుపైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 150 ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. చెట్లకొమ్మలు పడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆరోజు నుంచి నేటి వరకు చినగంజాంలో కరెంటు పునరుద్ధరించలేదు. నాలుగు రోజులుకావస్తున్నా... ప్రజలింకా అంధకారంలోనే మగ్గుతున్నారు. మోటార్లు పనిచేయకపోవడం వల్ల తాగునీటికి అల్లాడుతున్నారు. ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికీ పక్క మండలాలకు పరుగులు తీస్తున్నారు. కరెంటు లేకపోవడంతో ఫ్యాన్లు పని చేయక పగలు ఎండ వేడిమి, రాత్రి దోమల బెడదతో కంటిమీద కునుకు కూడా కరవైంది. కొవ్వొత్తుల వెలుగులో వంట చేసుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇంటి నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. కార్యాలయ విధులు నిర్వహించడం కోసం... చీరాల , వేటపాలెం మండలాలకు వెళ్లి అక్కడ ఉన్న బంధువుల ఇళ్ల నుంచి పని చేసుకుంటున్నారు. సోపిరాల, కొత్తపాలెం గ్రామాల యువకులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మండల ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించారు. అయితే చినగంజాం మండలంలోని ఇతర గ్రామాల్లోనూ... విద్యుత్ లేక పరిస్థితి దయనీయంగా ఉంది.
చీకట్లో చినగంజాం... మూడు రోజులవుతున్నా పునరుద్ధరించని విద్యుత్ సరఫరా...
Non-restoration of the power supply: ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బాపట్ల జిల్లా పర్చూరు నియోజక వర్గంలోని చినగంజాం మండలంలో అంధకారం నెలకొంది. ఈనెల 5న మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో దాదాపు 110 విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి . 150 ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి చినగంజాంలో కరెంటు సరఫరా పునరుద్ధరించకపోవడంతో.. ప్రజలు చీకట్లోనే మగ్గుతూ..అవస్థలు పడుతున్నారు.
Non-restoration of the power supply