ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలు జిల్లాల్లో పట్టుబడ్డ గంజాయి.. దగ్ధం చేసిన పోలీసులు

Ganjai Fires In State Different Places: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిని దహనం చేస్తున్నారు. గంజాయిరహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్ధేశ్యంతో పోలీసులు పని చేస్తున్నారు. ఆదివారం ఎన్టీఆర్, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో పట్టుబడిన గంజాయిని దగ్ధం చేశారు.

గంజాయి
Ganjai

By

Published : Dec 25, 2022, 8:01 PM IST

భారీస్థాయిలో గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు

Burnt the Seized Marijuana: గంజాయిరహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్ధేశ్యంతో పోలీసులు పని చేస్తున్నారు. ఆదివారం ఎన్టీఆర్, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో పట్టుబడిన గంజాయిని దగ్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 14 వేల కేజీల గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా పాల్గొన్నారు.

కంచికచర్ల మండలం పరిటాల వద్ద క్వారీకి వెళ్లే రోడ్లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 22 పోలీస్ స్టేషన్లలో నమోదైన 702 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 14 వేల కేజీల గంజాయిని పోలీసులు ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా తెలిపారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యల వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కళాశాల వద్ద ఇతర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ మేరకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లాలో:అన్నమయ్య జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొంతకాలంగా పట్టుబడిన గంజాయిని ఆదివారం జిల్లా కేంద్రంలో రాయచోటులోని పురపాలక డంపింగ్ యార్డ్​లో పోలీసులు దగ్ధం చేశారు జిల్లాలో నమోదైన 44 గంజాయి కేసులకు సంబంధించి పట్టుబడిన 632 కిలోల గంజాయిని అక్కడికి తరలించి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో తగలపెట్టారు. దగ్ధం చేసిన గంజాయి విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నిషేధిత గంజాయిని సాగు చేసినా.. విక్రయించినా నేరమని.. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీధర్ శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో:కర్నూలు జిల్లాలో 12 కేసుల్లో పట్టుబడిన 113 కేజీల గంజాయిని పోలీసులు దహనం చేశారు. కర్నూలులోని పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలో పట్టుబడిన గంజాయిని పోలీసులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. జిల్లావ్యాప్తంగా 12 కేసుల్లో 67 మంది ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు తగలబెట్టారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందాలతో స్లమ్ ఏరియాలతో పాటు కళాశాలల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తామన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details