తెదేపా కార్యకర్త శివశంకర్‌పై వైకాపా వర్గీయులు రామలింగా, పరమేశ్ అనే వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం వేపకుంట గ్రామంలో జరిగింది. దాడిలో గాయపడిన శివశంకర్‌ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటి వద్ద ఇతరులతో తనకున్న స్థల వివాదంలో వైకాపా నేతలు జోక్యం చేసుకుని దాడి చేయించారని శివ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్థల వివాదం.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి - vepakunta latest news
అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం వేపకుంటలో తెదేపా కార్యకర్తపై అదే గ్రామానికి చెందిన వైకాపా వర్గం వారు దాడి చేశారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
దాడిలో గాయపడిన వ్యక్తి