కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో వామపక్ష నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన నిరసన చేపట్టారు. కార్మిక చట్టాల సవరణలు ఆపాలని, లాక్డౌన్ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ, ఆటో, అసంఘటిత రంగ కార్మికులందరికీ పది వేల రూపాయల చొప్పున మూడు నెలల పాటు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్కీం వర్కర్లకు రెగ్యులర్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ చట్ట సవరణ ఆపాలని కోరారు. ఉద్యోగులకు సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు.
ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కదిరిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన - workers protest latest news update
సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కదిరిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ, సీపీఐ, ఆటో కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కార్మిక కుటుంబాలకు నెలకు పదివేల చొప్పున మూడు నెలలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కదిరిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన