అనంతపురం పట్టణంలోని నీరుగంటి వీధికి చెందిన శిరీష ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఆరు నెలల కిందట మరణించాడు. అప్పటి నుంచి తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. గత కొంత కాలంగా ముభావంగా ఉంటున్న శిరీష ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య - అనంతపురం జిల్లా నేరాలు
అనంతపురం పట్టణంలో విషాదం నెలకొంది. ఉరివేసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆరేళ్ల కిందట మృతురాలి భర్త చనిపోవడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య