ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో మృతదేహం.. కడుపునొప్పితో ఆత్మహత్య అని అనుమానం - woman suicide at anantapuram district news

అనంతపురం జిల్లా మెళవాయి గ్రామ శివారులోగల బావిలో అమ్మాయి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.

Woman commits suicide by falling into well
బావిలో పడి మహిళ ఆత్మహత్య

By

Published : Nov 5, 2020, 6:30 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం మెళవాయి గ్రామ శివారులోగల బావిలో అమ్మాయి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించారు. మృతదేహం అదే గ్రామానికి చెందిన అరుణ అనే మహిళదిగా గుర్తించారు.

పలుమార్లు కడుపునొప్పి అధికంగా ఉందని చెప్పేదని, ఆ బాధ భరించ లేక బావిలో పడి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details