అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. గ్రామాల్లో చెరువులు నిండి చాలాచోట్ల చెక్ డ్యాములు నిండాయి. జలకళ సంతరించుకున్నాయి. వీటిని చూసి సంతోషంలో ఉన్న రైతులకు.. గండ్లు ఆవేదన మిగులుస్తున్నాయి. గంగులవాయిపాలెం చెరువుకు గండి పడి చెరువు నీరంతా వృథాగా కర్ణాటక ప్రాంతానికి తరలి వెళ్లిపోతోంది. ఇప్పుడు సాగుకు నీరు లేని కారణంగా.. మరోసారి వలసలకు వెళ్లేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. అధికారులకు ఈ విషమయై ఫిర్యాదు చేసిన స్పందన రావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో ... అన్నదాతల ఆవేదన! - చెక్ డ్యాములు నిండి జలకళ సంతరించుకుంటోంది
అనంతపురం జిల్లా మడకశిరలో వర్షం కురుస్తున్న వేళ సంతోషించాలో వద్దో తెలియని పరిస్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. డ్యాములు తెగి నీరు వృధాగా కర్ణాటక ప్రాంతానికి తరలిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నామని బాధ పడుతన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన!