వార్డుల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరిస్తూ.. ఓటర్ స్లిప్లు పంచుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం గుట్టకింద కాలనీలో అభ్యర్థుల తరపున ఆమె ప్రచారం చేశారు.
అక్కడ ప్రచారం చేస్తున్న ఓ వార్డు వాలంటీర్ను నిలదీశారు. వాలంటీర్ అయివుండి.. ఓటర్ స్లిప్లు ఎలా పంచుతావని అడగటంతో సదరు వ్యక్తి అక్కడినుంచి జారుకునే యత్నం చేశారు. వాలంటీర్లు వైకాపాకే ఓటు వేయాలని ఓటర్లను బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు.