ఆమె వాలంటీర్ (Volunteer)గా విధులు నిర్వహిస్తోంది. ఇద్దరు కుమారులను చూసుకుంటోంది. కానీ ఏమైందో ..ఆత్మహత్య(suicide) చేసుకుంది. ఈ విషాధ ఘటన అనంతపురం జిల్లా మడకశిరలోని బేల్దార్ కాలనీలో జరింగింది.
suicide : మడకశిరలో ఉరేసుకుని వాలంటీర్ ఆత్మహత్య - మడకశిరలో ఆత్మహత్య వార్తలు
ఏమైందో ఏమో..కుటుంబ సమస్యలో..ఆరోగ్య సమస్యలో, ఉద్యోగ సమస్యలో తెలీదు కానీ ఓ వాలంటీర్ ఆత్మహత్య (Volunteer suicide) చేసుకుంది. ఇద్దరు పిల్లలను విడిచి..బతుకు సాగించలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిరలోని బేల్దార్ కాలనీలో జరింగింది. ఆమె మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లా మడకశిరలోని బేల్దార్ కాలనీలో అంజలి అనే మహిళ.... ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు ఎర్రబొమ్మనహళ్లి గ్రామ సచివాలయంలో... వాలంటీర్(Volunteer)గా విధులు నిర్వహిస్తోంది. మృతురాలికి ఈమెకు 5,7 సంవత్సరాలు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దర్యాప్తు అనంతరం పోలీసులు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి.Jawan: జమ్ముకశ్మీర్ కాల్పుల్లో గుంటూరు జిల్లా జవాను వీరమరణం