ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో భవిష్యత్తులోనూ వైద్య శిబిరాలు'

విశాఖలో గ్యాస్​ లీకేజీ ఘటనలో బాధితులు కోలుకుంటున్నారని.. అయితే ఆయా గ్రామాల్లో పరిస్థితులు చక్కబడిన తర్వాతే వారిని ఇళ్లకు తరలిస్తామని విశాఖ డీఎంహెచ్​వో తెలిపారు. రాబోయే రోజుల్లో సైతం తరచూ వైద్యశిబిరాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

'భవిష్యత్తులోనూ గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోనూ వైద్య శిబిరాలు'
'భవిష్యత్తులోనూ గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోనూ వైద్య శిబిరాలు'

By

Published : May 10, 2020, 4:43 PM IST

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనలో బాధితులు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యాధికారులు తెలిపారు. విశాఖలో అన్ని ఆస్పత్రుల్లో కలిపి 411 మంది చికిత్స పొందగా.. వారిలో చాలామంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారి నివేదికలు సిద్ధం చేసి డిశ్చార్జ్​ రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు.

ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే బాధితులను ఇళ్లకు పంపుతామని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఆయా గ్రామాల్లో తరచూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామని విశాఖ వైద్యాధికారి తిరుమలరావు అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై విశాఖ వైద్యాధికారితో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details