ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎదురుతిరిగిన గ్రామస్థులు... కాళ్లకు పని చెప్పిన ఎస్సై - SI

అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో ఎస్సై అత్యుత్సాహం చూపాడని ఓటర్లు ఎదురు తిరిగారు. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసినందున ఎస్సై పలాయనం చిత్తగించారు.

వెన్ను చూపిన ఎస్సై

By

Published : Apr 11, 2019, 6:33 PM IST

వెన్ను చూపిన ఎస్సై

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెలిగొండ గ్రామంలో ఎస్.ఐ ఓటర్లను కొట్టాడంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని 146, 147 పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చిన ఎస్ఐ... ఓటర్ల పై లాఠీఛార్జి చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఎదురు తిరగడంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎస్ఐ గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత అధికారులు యధావిధిగా పోలింగ్​ను కొనసాగించారు. ఎస్ఐ తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details