అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో వైకాపా నాయకులు రామాంజనేయులు, నాగమూర్తి.. రైతులు పండించిన కూరగాయలను కొనుగోలు చేశారు. వీటిని కియా ఇండస్ట్రీయల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని ఎస్సై గణేశ్ విజ్ఞప్తి చేశారు.
రైతులకు భరోసా... పేదలకు చేయూత - lockdown in ananthapuram
అనంతపురం జిల్లా ఎర్రమంచిలో లాక్డౌన్ కారణంగా పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టాన్ని చూసిన వైకాపా నాయకులు ముందుకొచ్చి పంట కొనుగోలు చేశారు. వాటిని గ్రామస్థులకు పంపిణీ చేశారు.
ఎర్రమంచిలో కూరగాయలు పంపిణీ చేస్తున్న వైాకాపా నేతలు