అనంతపురం జిల్లా మడకశిర మండలం రామగిరి చుట్టూ ఎత్తైనా కొండలు ఉన్నాయి. కొండల కారణంగా సెల్ టవర్స్ నుంచి సిగ్నల్స్ అందక ఈ గ్రామంలో సెల్ఫోన్లు పని చేయటం లేదు. ప్రభుత్వ రేషన్ బియ్యం దుకాణాల్లో వేలిముద్రలు తీసుకొనే యంత్రాలకు సిగ్నల్స్ అందక వేలిముద్రలు తీసుకోవటం లేదు. గత్యంతరం లేక ఆ గ్రామ డీలర్ ఆ ఊరుకు రెండు కిలోమీటర్లు దూరంలో సెల్ సిగ్నల్స్ అందే ప్రాంతంలో వేచి ఉంటున్నాడు. వృద్ధులు అక్కడకు వెళ్లడానికి చేతకాక... వారికి వచ్చే కోటాను వదిలేసుకుంటున్నారు. ఈ సమస్య తీరాలంటే ప్రభుత్వ, ప్రైవేటు టెలికాం సంస్థ వారు ఊరిలో సెల్ టవర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రేషన్ కావాలా...అయితే రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే..! - To get ration .. two kilometers to go
అనంతపురం జిల్లా మడకశిర రామగిరిలో కొండల కారణంగా సెల్ టవర్స్ నుంచి సిగ్నల్స్ అందక ఈ గ్రామంలో సెల్ఫోన్లు పని చేయవు. రేషన్ బియ్యం దుకాణాల్లో యంత్రాలకు సిగ్నల్స్ అందకపోవటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
రేషన్ కావాలంటే.. రెండు కిలోమీటర్లు పోవాల్సిందే...