ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య - three brutally murderd for tresure

అనంతపురం జిల్లా తనకొల్లు మండలం కొర్తికోటలో గుప్త నిధుల కోసం ముగ్గుర్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

గుప్త నిధుల కోసం దారుణ హత్య

By

Published : Jul 15, 2019, 10:12 AM IST

Updated : Jul 15, 2019, 1:32 PM IST

గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటలో ముగ్గరి దారుణ హత్య కలకలం రేపింది. గ్రామంలో శివాలయం వద్ద ఇద్దరు మహిళలు, మరొక వ్యక్తి రక్తపు మడుగులో కనిపించడం భయాందోళనకు దారి తీసింది. శివాలయం గుడికి పూజారిగా శివరామిరెడ్డి ఉన్నారు. అతని అక్క కమలమ్మ అక్కడే ఉంటూ అతనికి వంట చేసిపెడుతుండేది. బెంగళూరులో నివాసం ఉండే సత్యలక్ష్మి నిన్ననే గ్రామానికి వచ్చింది. వీరందర్నీ నిన్న రాత్రి గుడి వద్ద 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారిని అత్యంత కర్కశంగా గొంతు కోసి హత్య చేశారు. తర్వాత వారి రక్తాన్ని గుడిలో ఉన్న శివలింగంపై, పుట్టలపై చల్లినట్టు ఆనవాళు ఉన్నాయి. ఉదయం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుప్త నిధుల కోసమే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. కదిరి డీఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పంపారు.

Last Updated : Jul 15, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details