ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తిలో దొంగల బీభత్సం.. లక్ష నగదు, బంగారం చోరీ - గుత్తిలో దొంగం బీభత్సం

తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఇళ్లల్లో నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జరిగింది. మొత్తం 4 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

theives in gutti ananthapuram district
గుత్తి పట్టణంలో దొంగతనం

By

Published : Jul 12, 2020, 1:22 PM IST

అనంతపురం జిల్లా గుత్తిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని బండ గేరి, కమటం వీధిలో 4 ఇళ్లల్లో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. లక్ష రూపాయల నగదు, ఒక జత చెవి కమ్మలు, బంగారు ఉంగరం, 5 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇళ్లల్లో ఎవరూ లేని సమయంలో వచ్చి దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details