ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Theft in bus: బస్సులో చోరీ.. బ్యాగులో దాచిన రూ.10లక్షలు మాయం..! - ap latest news

Theft in bus: అనంతపురం జిల్లా ముదిగుబ్బ నుంచి కొత్తచెరువుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దొంగతనం జరిగింది. కడప జిల్లా పులివెందులకు చెందిన మంజునాథ్, శ్రీలత దంపతులు.. కొత్తచెరువులో స్థలం కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు బ్యాగులో ఉన్న రూ.15లక్షల్లో.. రూ.10లక్షలు మాయమయ్యాయి.

Theft in bus at anantapur
బస్సులో చోరి.. బ్యాగులో దాచిన రూ.10లక్షలు అపహరణ

By

Published : Mar 6, 2022, 9:14 AM IST

Theft in bus: కడప జిల్లా పులివెందులకు చెందిన మంజునాథ్, శ్రీలత దంపతులు.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ నుంచి ఆర్టీసీ బస్సులో కొత్తచెరువుకు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో.. వారి వద్దనున్న రూ.10లక్షలు చోరీకి గురయ్యాయి. పులివెందుల అమ్మవారి శాల ఏరియాకు చెందిన మంజునాథ్, శ్రీలత.. ముదిగుబ్బ వరకు కారులో వచ్చారు. అక్కడనుంచి కొత్తచెరువులో ఓ స్థలం కొనుగోలు నిమిత్తం ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో వారి బ్యాగులో ఉంచిన నగదును దొంగలు అపహరించారు.

కొత్తచెరువులో తమ బంధువుల ఇంటికి చేరుకొన్న దంపతులు మంజునాథ్ శ్రీలత నగదు చూసుకోగా.. బ్యాగులో ఉంచిన 15 లక్షల రూపాయల్లో.. 10 లక్షలు లేకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details