అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో దొంగలు చేతివాటం చూపారు. ఉక్కపోత దృష్ట్యా మిద్దెలపై పడుకుంటున్న వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 30 వేల గదు.. బంగారం దోచుకెళ్లారు. మిగతా ఇళ్లల్లో ఎంత దోచుకున్నారన్నది తెలియాల్సి ఉంది. ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరి రూరల్ ఎస్సై వెంకటస్వామి చోరి జరిగిన ఇళ్లను పరిశీలించి.. క్లూస్ టీంతో దర్యాప్తు చేయిస్తామని చెప్పారు.