ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రెైతుల డిమాండ్ - The demand of the farmers to establish a center for the purchase of grains

సరిగా కొనుగోలు జరక్క తీవ్రంగా నష్టపోతున్నామని అనంతపురం జిల్లాలో వరి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ananthapuram district
వరికోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలిని రెైతుల డిమాండ్

By

Published : May 8, 2020, 6:14 PM IST

అనంతపురం జిల్లా శింగనమల చెరువు వరి రైతులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. 105 కేజీల వరి బస్తా ధర 1400 వందల రూపాయలకే ప్రైవేటు వ్యాపారస్తులు అడుగుతున్నారని.. అ రేటుకు అమ్మితే రూ.10వేలు వరకు నష్టపోతామని రెైతులు అవేదన వ్యక్తం చేశారు.

మండల వ్యవసాయ అధికారులు వరి పోలాలలో వరి ధాన్యాన్ని పరిశీలించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. క్వింటా వరి ధాన్యానికి రెండు వేలు రూపాయిల మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రెైతుసంఘం అధ్వర్యంలో ఈ నెల 11న మండల వ్యవసాయ కార్యాలయం వద్ద అయికట్టు రెైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని అన్నారు.

అయికట్టు క్రింద దాదాపు అధికార అనధికారంగా దాదాపుగా 5,000 వేలు ఎకరాలు ఉండగా ఈసారి దాదాపుగా1600 వందల ఎకరాల్లో వరి సాగు చేశారు
ఈ పంట సాగు చేసిన వారంతా నూటికి ఏనభెై శాతం మంది కౌలు రెైతులే. వారు ప్రైవేటు వ్యక్తుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చుకొని సాగు చేస్తున్నారు.
ఒక ఒకరానికి రూ. 25 వేలు నుంచి రూ. 30, వేలు వరకు పెట్టుబడితో సాగు చేస్తున్నామని అన్నారు. కానీ, కేవలం ముప్ఫై, ముఫ్ఫై మూడు బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుందని తెలిపారు.

ఇది చదవండి

ABOUT THE AUTHOR

...view details