రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సోమవారం ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరనస చేపట్టారు. స్థానిక తెదేపా కార్యాలయం నుంచి కనేకల్ రోడ్, లక్ష్మీ బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ రాయదుర్గం తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం సమర్పించారు.
కళ్యాణదుర్గంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావంగా కళ్యాణదుర్గంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరనన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ స్థానిక ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా అనుమతి లేదని నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతసేపటి తర్వాత విడుదల చేశారు. అమరావతి రాజకీయ ఐకాస నాయకుడు తిరుపతి రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో కులాలు మతాలు ప్రస్తావిస్తూ ఏకపక్షంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:
అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు: లోకేశ్