ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ చంద్రదండు డిమాండ్ చేసింది. తెదేపా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అనంతపురం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు తెదేపా కార్యకర్తలు భయపడరని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబు నాయకత్వంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన చేస్తున్న చంద్రదండు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
తెదేపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ చంద్రదండు ధర్నా - అనంతపురంలో తెదేపా ధర్నా
తెదేపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ అనంతపురంలో చంద్రదండు ధర్నా చేపట్టింది. రాక్షస పాలనకు నాయకత్వం వహిస్తున్న సీఎం తన పదవికి రాజీనామా చేయాలంటూ చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు డిమాండ్ చేశారు.
Protest