PAYYAVULA ON LEPAKSHI LANDS : లేపాక్షి భూములకు సంబంధించి.. వేలం ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించడం స్వాగతించాల్సిన పరిణామమని.. తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. 9 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను.. కేవలం రూ.500 కోట్లకే అప్పగించే ప్రయత్నం.. ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. లేపాక్షి భూముల పరిరక్షణకు.. ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనన్న పయ్యావుల.. కబ్జాలకు సహకరించినందుకు.. అధికారులే శిక్షలకు బాధ్యులవుతారని.. హెచ్చరించారు.
లేపాక్షి భూముల కబ్జాకు.. అధికారులే బాధ్యులు: పయ్యావుల - తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
Payyavula Keshav : లేపాక్షి హబ్ భూముల వేలం ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశించినట్లు తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. రూ.9 వేల కోట్ల విలువ చేసే భూములను.. కేవలం రూ.500 కోట్లకే అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు.
ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. కబ్జాలకు సహకరించినందుకు అధికారులే బాధ్యులవుతారు. హరిత ఫర్టిలైజర్స్‌లో డిఫాల్టర్ వేలానికి ఎలా వెళ్తారు? వైకాపా ప్రభుత్వ పెద్దలు సహకరించకుండా ఇదంతా ఎలా సాధ్యం?. గడువులోగా రూ.500 కోట్లు కట్టలేకపోయారు. గడువు పెంచలేమని ఎన్‌సీఎల్‌టీ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజల భూములను కాపాడాలి. ప్రభుత్వ భూముల్లో పారిశ్రామికవాడలు అభివృద్ధి చేయాలి. లేపాక్షి భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేయాలి. -పయ్యావుల కేశవ్, తెదేపా ఎమ్మెల్యే
ఇవీ చదవండి: