అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి అనుచరుడు మల్లేపల్లి నారాయణకు తెదేపా బి ఫారం ఇవ్వలేదు. ఈ కారణంగా కొంతమంది నేతలు పార్టీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అలా ఎలా చేస్తారని.. మరి కొంతమంది నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. పార్టీ కోసం కష్టపడిన తనకు బి ఫారం దక్కలేదని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
పోటీకి అవకాశం ఇవ్వలేదని తెదేపా నేత ఆవేదన - టికెట్ ఇవ్వలేదని తెదేపా నేతల ఆందోళన న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నేతలు ఆవేదన చెందారు. చాలా కాలంగా పోటీ చేద్దామని చూస్తుంటే.. అవకాశం దక్కకుండా పోయిందంటూ అనంతపురం జిల్లాలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు.
బి ఫారం ఇవ్వలేదని తెదేపా నేత ఆవేదన