తెలుగుదేశంలో చేరిన ఇబ్రహిం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నాయకుడు, ప్రముఖ గార్మెంట్స్ వ్యాపారిచమ్మా ఇబ్రహీం తనఅనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలోచేరారు. మంత్రి కాలవ శ్రీనివాసులు వారికి పార్టీ కండువాలు వేసి తెదేపాలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబునేతృత్వంలో రాష్ట్రంలోఅద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమయ్యాయని మంత్రి కాలవఅన్నారు. చమ్మా ఇబ్రహీం తన అనుచరులతో కలిసి తెదేపాలోచేరడం శుభసూచకమని పేర్కొన్నారు. అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమం కోరుకునే ప్రతి ఒక్కరూ పార్టీకిఅండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.