సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పేద విద్యార్థినులు స్మార్ట్ఫోన్లు లేక ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారని...వారిపై అపరాధ రుసుం విధించి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ప్రిన్సిపాల్‌ను తొలగించి మహిళా ప్రిన్సిపాల్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
నిరసన కార్యక్రమం ముగించుకొని కళాశాలకు తిరిగి వచ్చిన విద్యార్థినులను లోపలికి రానివ్వకుండా కళాశాల సిబ్బంది అడ్డుకొని గేటుకు తాళాలు వేశారు. దీన్ని నిరసిస్తూ...విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని కళాశాల సిబ్బందితో మాట్లాడి విద్యార్థినులను కళాశాల లోపలికి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.