అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. గుత్తి మండల శివారులోని జాతీయ రహదారిపై ఉన్న చెక్‌పోస్టులను పరిశీలించారు. లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు మూసేశామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరిని సరిహద్దులు దాటడానికి అనుమతించమన్నారు. లాక్డౌన్ అతిక్రమించిన వాహన యజమానులు, దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ..వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు.
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ - లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు.
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
TAGGED:
అనంతపురం ఎస్పీ తాజా వార్తలు