ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు.. రవాణాకు తీవ్ర అంతరాయం

అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల వాగులు రోడ్లమీద ప్రవహించాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుత్తి మండలంలో మరువ వాగులో లారీ చిక్కుకుపోయింది. తాడిపత్రిలో ఓ వృద్ధురాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.

streams over flowing in ananthapuram district
వాగు ప్రవాహంలో చిక్కుకుపోయిన లారీ

By

Published : Oct 1, 2020, 2:15 PM IST

Updated : Oct 1, 2020, 4:54 PM IST

భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు

అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుత్తి మండలం కొజ్జెపల్లి సమీపంలోని మరువ వాగు.. జాతీయ రహదారిపై పొంగి ప్రవహిస్తోంది. ఈ సమయంలో రోడ్డు దాటుతున్న లారీ వాగులో చిక్కుకుపోయింది. వాగును దాటుతున్నమరో కారు ప్రమాదానికి గురైంది. దీంతో ముందు జాగ్రత్తగా గుత్తి-బళ్లారి మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని ప్రొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. కొంతసేపటికి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. తాడిపత్రి మండలంలో వరద ప్రవాహంలో ఓ వృద్ధురాలు కొట్టుకుపోయింది. చుక్కలూరు-వరదాయిపల్లి మధ్య వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు.

Last Updated : Oct 1, 2020, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details