ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమనీయంగా శ్రీనివాసుని కల్యాణం

శ్రావణమాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా గురువారం ఉరవకొండలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరిగింది.

కల్యాణం

By

Published : Aug 15, 2019, 6:02 PM IST

కమనీయంగా శ్రీనివాసుని కల్యాణం

అనంతపురం జిల్లా ఉరవకొండలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. శ్రీవారి కల్యాణం కన్నులపండువగా సాగింది. శ్రావణమాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు. వేకువఝాము నుంచే ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారికి సుప్రభాత సేవ, శ్రీ లక్ష్మీగణపతి హోమం, శ్రీ లక్ష్మీ నారాయణ హోమం, వరుణయాగం, కుబేర హోమం, పూర్ణ హారతి, మంగళ హారతి తదితర ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కల్యాణం నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేసి అన్నదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details