అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఇటీవల రెడ్‌జోన్లుగా గుర్తించిన 2 ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. రెడ్‌జోన్లలోని చెక్‌పోస్టుల వద్ద పోలీసుల విధి నిర్వహణ తీరును డీఎస్పీ శ్రీనివాసులు ఆరా తీశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
అనంతలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న వైరస్
అనంతపురం జిల్లాలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని భావిస్తున్నా రోజూ ఎక్కడో చోట కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు హిందూపురంలో విజృంభించిన వైరస్... జిల్లా అంతటా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 71 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో గుంతకల్లులో రెడ్‌జోన్లుగా గుర్తించిన 2 ప్రాంతాలను అధికారులు పరిశీలించారు.
రెడ్జోన్లలు పరిశీలించిన అధికారులు
జిల్లాలో 400 మందికిపైగా అనుమానితులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పటిదాకా హిందూపురం, అనంతపురంలో విజృంభించిన వైరస్... గత పది రోజుల్లో కల్యాణదుర్గం, శెట్టూరు, విడపనకల్లు, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, అనంతపురం గ్రామీణం, పుట్లూరు మండలాల్లోనూ విస్తరిస్తోంది. దీంతో కంటైన్మెంట్ జోన్లలో మరింత పకడ్బందీగా ప్రణాళిక రూపొందించినట్టు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
ఇవీ చూడండి...