అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామంలోని ఓ మహిళతో చరవాణిలో అసభ్యకరంగా మాట్లడుతున్నారనే కారణంతో ఓ వర్గంపై మరో వర్గం కర్రలు, వేట కొడవళ్లతో దాడికి పాల్పడింది. ఈ ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన ముగ్గురికి తీవ్రగాయలవ్వగా.. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మైరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళతో అసభ్య ప్రవర్తన.. ఇరువర్గాల ఘర్షణ - anantapuram latest news
మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నారని ఓ వర్గంపై మరో వర్గం కర్రలు, వేట కొడవళ్లతో దాడికి పాల్పడింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయలు కాగా.. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.
పూలకుంటలో ఇరు వర్గాల ఘర్షణ